News February 27, 2025

దోమకొండ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పట్టభద్రుల, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది పనితీరు స్వయంగా పరిశీలించారు. అక్కడే బందోబస్తులో ఉన్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డితో కాసేపు మాట్లాడి, పరిస్థితులు తెలుసుకున్నారు. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది.

Similar News

News November 18, 2025

స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌‌గా డా. కె.అరుణప్రియ

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.

News November 18, 2025

HNK: లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

image

హనుమకొండ టీవీ టవర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

News November 18, 2025

X(ట్విటర్) డౌన్‌కు కారణమిదే!

image

ప్రముఖ SM ప్లాట్‌ఫామ్ ‘X’ సేవలు <<18322641>>నిలిచిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. దాని హోస్ట్ సర్వర్ ‘క్లౌడ్‌ఫ్లేర్‌’లో గ్లిచ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. X మాత్రమే కాకుండా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన కాన్వా, పర్‌ప్లెక్సిటీ వంటి సేవలు నిలిచిపోయాయి. ‘సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ వెల్లడించింది.