News December 16, 2024
దోమకొండ: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రావడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమకొండలో ఆదివారం రాత్రి జరిగింది. SI ఆంజనేయులు వివరాలిలా..బోయిన రాకేశ్ (26) కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికెళ్లింది. ఎంతకైనా రాకపోవడంతో మనోవేదనకు గురైన రాకేశ్ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 18, 2025
NZB: ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక వాయిదా
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ నెల 20వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. తిరిగి జనవరి 27వ తేదీ నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
News January 18, 2025
నిజాంసాగర్: నేడు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం నిర్వహించే 2025 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు శనివారం 10:30 వరకు పాఠశాలకు చేరుకోవాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మనుజే యోహనన్ తెలిపారు. 11 గంటల తర్వాత లోపలికి అనుమతించమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News January 18, 2025
నిజామాబాద్: ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు రాక
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తదుపరి గోల్ హనుమాన్ వద్ద మున్సిపల్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించి రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు.