News September 14, 2024
దోమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదం ఇద్దరి స్నేహితుల కుటుంబాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన జొన్నల రాము(23), ముత్తి రమేశ్(24))లు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న వినాయకుడి పూజా సామగ్రి కోసం బైక్‌పై కామారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టింది.
Similar News
News October 15, 2024
NZB: త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మహేష్ కుమార్
త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
News October 14, 2024
చందూర్: నిజాంసాగర్ కాలువలో మృతదేహం
చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.
News October 14, 2024
NZB: బజ్జీల కోసం గొడవ, ముగ్గురి అరెస్ట్
నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆకాశ్, మనీష్, ప్రమోద్ రెండు రోజుల క్రితం తెల్లవారుజామున బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు తింటూ మరో 2 కావాలన్నారు. అయితే బజ్జీలు అయిపోయాయని హోటల్ యజమాని సచిన్ చెప్పగా గొడవ జరిగింది. అనంతరం నిందితులు సచిన్ ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసి నిప్పంటించగా ఘటనపై 3వ టౌన్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.