News March 1, 2025
దోమలో బాలికపై యువకుడి అఘాయిత్యం

నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన దోమ PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువకుడు (20), తన ఇంటి సమీపంలో ఉండే చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 1, 2025
మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.
News March 1, 2025
వారికి రేపటి నుంచి ఒంటి పూట బడులు

TG: నెలవంక కనిపించడంతో రేపటి నుంచి <<15622646>>రంజాన్ మాసం<<>> ప్రారంభం కానుంది. దీంతో ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉ.8 నుంచి మ.1.30 వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. కాగా మిగతా విద్యార్థులకు మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. APలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ఆరంభం కానున్నాయి.
News March 1, 2025
చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్‌ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.