News March 14, 2025
దోమ: ఒకే ఈతలో రెండు దూడలు..

ఒకే ఈతలో రెండు లేగ దూడలు జన్మించిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న ఒక ఆవు ఉంది. ఆ ఆవుకు ఒక లేగ దూడను జన్మనివ్వగా మరి కొద్దిసేపటి తర్వాత మరో లేగ దూడకు జన్మనిచ్చిందని వెంకన్న తెలిపారు. తన ఆవుకు రెండు లేగ దూడలు జన్మించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు.
Similar News
News January 9, 2026
మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి
News January 9, 2026
రాయవరానికి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు

సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించనున్నారు. ఈ బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. సీఎం ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సభా ప్రాంగణం పసుపుమయంగా మారింది.
News January 9, 2026
ఆస్కార్ బరిలో మహావతార్, కాంతార: చాప్టర్-1

ఆస్కార్-2026 బరిలో మహావతార్ నరసింహ, కాంతార: చాప్టర్-1 నిలవనున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ విభాగంలో పోటీ పడనున్నట్లు తెలిపింది. ఇందుకు ఎంతో గర్వపడుతున్నట్లు పేర్కొంది. గతేడాది విడుదలైన ఈ రెండు చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతారలో విజువల్ ఎఫెక్ట్స్, రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి.


