News January 25, 2025
దోమ: పోతిరెడ్డిపల్లి శివారులో జింక మృతి

వీధి కుక్కల దాడిలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దోమ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో జింక మృతి చెందింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. సంబంధిత శాఖ అధికారులు వన్యప్రాణుల రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News September 16, 2025
సింగరేణి: ఖనిజ అన్వేషణలకు లైసెన్సులు జారీ

కొత్తగూడెం: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ.. జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్నకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్లోని టీ హబ్లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో వీటిని అందజేశారు.
News September 16, 2025
ఎల్లారెడ్డిపేట: యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా నాగరాజ్

యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన మానుక నాగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొక్కు దేవేందర్, మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ.. యాదవుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News September 16, 2025
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.