News December 13, 2024
దోమ: బాల వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ

52వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో దోమ మండల పరిధిలోని దాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. వనరుల నిర్వహణలో రెండవ బహుమతి దయాకర్, చిరుధాన్యాలు వాటి ప్రాధాన్యతలో రెండవ బహుమతి పొందిన అక్షయలు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
Similar News
News February 26, 2026
HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.
News February 25, 2026
సైబరాబాద్ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
News February 25, 2026
RR: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 180 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది 1st ఇయర్ విద్యార్థులు, 70,171 మంది 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.


