News March 14, 2025

దోమ: మతిస్థిమితం లేక సూసైడ్ చేసుకున్నాడు: ఎస్ఐ 

image

వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని <<15753806>>కిష్టాపూర్ గ్రామానికి<<>> చెందిన నందార్‌పేట్ లక్ష్మయ్య గౌడ్ (55) పొలం దగ్గర షెడ్డులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేక ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.  

Similar News

News March 1, 2026

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

బాపట్ల (D) అద్దంకి మధురా నగర్ నామ్ (NAM) రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కొంగపాడుకి చెందిన యేసుపోగు వినోద్(32), ఏజర్ల చిన్న(25) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 1, 2026

నేటి సామెత: కసవు ఉంటేనే పశువు

image

‘కసవు’ అంటే గడ్డి లేదా పశుగ్రాసం. పశువుల దగ్గర మేత (గడ్డి) పుష్కలంగా ఉంటేనే ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది, పాలిస్తుంది, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుంది. మేత లేని పశువు నీరసించిపోతుంది. అందుకే పశువు మనకు ఉపయోగపడాలి అంటే, దానికి మనం సరైన ఆహారాన్ని అందించాలి. దానికి మనం ఇచ్చే దానిని బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది.”పెట్టుబడి లేనిదే లాభం రాదు” అనే విషయాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

News March 1, 2026

నేడు 444 విమానాలు రద్దు!

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ నేపథ్యంలో ఈరోజు 444 విమానాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. విమానయాన సంస్థలతో డీజీసీఏ టచ్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. ప్రయాణికులు ముందుగానే ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాలని సూచించింది. ప్రయాణికులు AirSewa ద్వారా సమస్యలను తెలపొచ్చని పేర్కొంది. కాగా నిన్న 410 డొమెస్టిక్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.