News February 27, 2025
దోర్నాల ఘాట్లో ఎస్పీ తనికీలు.!

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డుపై, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బుధవారం రాత్రి దోర్నాలలోని మల్లికార్జున్ నగర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 27, 2025
ప్రకాశం జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్.?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే నెల మొదటి వారంలో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 5, 6, 7వ తేదీల్లో ఆయన జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో పర్యటించి ఉపాధి పనులను, పంట కుంటలను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లలో డ్వామా అధికారులు నిమగ్నమయ్యారు.
News February 27, 2025
ఒంగోలు: హోంవర్క్ నెపంతో విద్యార్థికి వాత పెట్టిన టీచర్

ఒంగోలులోని గంటపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 20న విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాబిదా అనే ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి పిరుదుల మీద విచక్షణారహితంగా వాతలు పెట్టింది. ఆ విద్యార్థికి కాల్చిన చోట పుండ్లు పడటంతో నొప్పి భరించలేక తల్లికి చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసింది. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఆమె భర్త చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 27, 2025
ప్రకాశం: పండగ పూట నలుగురు మృతి

పండగ పూట వివిధ కారణాల వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. గిద్దలూరులో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు మృతిచెందగా, సంతనూతలపాడు(మం) గుడిపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డెరపాలెంలో ఏడుకొండలు డాబాపై నిద్రిస్తూ నిద్రమత్తులో కింద పడి మృతి చెందాడు. మార్కాపురంలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా గడపాల్సిన పండగ పూట పలు గ్రామాల్లో విషాదం నెలకొంది.