News September 1, 2024
దోర్నాల: ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చరియలు

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.
Similar News
News December 8, 2025
OGL: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

ఒంగోలులో యువతి <<18495938>>ఆత్మహత్యకు <<>>యువకుడి మోసమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కబాడిపాలేనికి చెందిన నళిని(33) ఎంటెక్ చదివింది. మహేంద్ర నగర్‌కు చెందిన సింగోతు శ్రీనివాస్ ప్రేమ పేరిట దగ్గరై ఆమెను లొంగదీసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెళ్లి కష్టమని చెప్పాడు. దీంతో నళిని పెళ్లి గురించి మాట్లాడటానికి యువకుడి ఇంటికి శనివారం వెళ్లగా వాళ్లు లోపలకు రానివ్వలేదు. మనస్తాపానికి గురైన యువతి ఇంటికొచ్చి ఉరేసుకుంది.
News December 7, 2025
ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.
News December 7, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన.!

ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.


