News September 1, 2024

దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

image

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.

Similar News

News September 11, 2024

ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు

image

ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్‌ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.

News September 11, 2024

నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

News September 10, 2024

వరద బాధితులకు రూ.10.60 కోట్లు విరాళం: మంత్రి గొట్టిపాటి

image

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.