News March 29, 2024
దోశలు వేసిన తిరుపతి MLA అభ్యర్థి

తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
చిత్తూరు జిల్లా అధికారులకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ వారి ముందస్తు అనుమతి లేకుండా సబార్డినేట్ అధికారులను డిప్యూట్ చేయకూడదన్నారు. ఈ పీజేఆర్ఎస్ నిర్వహణపై కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి ఇప్పటికే అత్యవసర సందేశాన్ని పంపినట్లు డీఆర్వో వివరించారు.
News November 23, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
చిత్తూరు: తండ్రి రిటైర్డ్ మిలిటరీ.. కొడుకు దొంగ

బెంగళూరు ATM చోరీ కేసులో <<18367776>>దోచుకున్న<<>> డబ్బులు దాచిపెట్టిన నవీన్ తండ్రి ఓ రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి. గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్కు మూడు నెలల క్రితమే వివాహమైంది. ATM చోరీ కేసులో నవీన్ ఇంట్లో దాచిపెట్టిన రూ.5.60 కోట్లను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు.


