News August 10, 2024
దౌల్తాబాద్: చిన్నారులపై పిచ్చికుక్కల దాడి

వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలపై దాడులు చేస్తున్నాయి. దౌల్తాబాద్ మండలంలో శనివారం ఐదుగురు చిన్నారులను గాయపరిచాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమివేయడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. పిల్లలకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 8, 2026
MDK: మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 8, 2026
నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తనిఖీ

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఫెసిలిటేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 7, 2026
మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.


