News May 11, 2024
ద్వారంపూడికి పవన్ మాస్ వార్నింగ్

కాకినాడ సిటీలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ సంగతి చూస్తా.. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, ప్రకృతి వనరులను దోచేశావు, పచ్చని మడ అడవులను నరికేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి నిన్ను రోడ్డుమీదికి లాక్కొస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.
Similar News
News February 24, 2026
రాజమండ్రి: కల్తీ పాల ఘటన.. రంగంలోకి స్పెషలిస్ట్ డాక్టర్!

రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన సమగ్రంగా పరిశీలించారు సరైన ప్రోటోకాల్‌తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.
News February 24, 2026
రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్‌లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్‌లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
News February 23, 2026
కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.


