News May 11, 2024
ద్వారంపూడికి పవన్ మాస్ వార్నింగ్

కాకినాడ సిటీలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ సంగతి చూస్తా.. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, ప్రకృతి వనరులను దోచేశావు, పచ్చని మడ అడవులను నరికేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి నిన్ను రోడ్డుమీదికి లాక్కొస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.
Similar News
News February 13, 2025
చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్

బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.