News October 2, 2024
ద్వారకాతిరుమలలో నేడు ఎంపీ పురందీశ్వరి పర్యటన

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం (నేడు) ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే మండల పరిషత్ అభివృద్ధిపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అన్నారు.
Similar News
News October 29, 2025
నరసాపురం: ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

నరసాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత జిల్లా కలెక్టర్ పీఎం లంకలో డిజిటల్ భవన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు.
News October 29, 2025
రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.
News October 29, 2025
ప.గో. కలెక్టర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.


