News February 10, 2025
ద్వారకాతిరుమల: కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఘంట సోమశేఖర్(36) కడుపు నొప్పి భరించలేక ఈనెల 5న రాత్రి కలుపు మందు తాగాడు. 6న ఉదయం ఇంట్లో చెప్పగా, భీమడోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య అనిత ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
సాగర్ కేవలం ప్రాజెక్టు కాదు.. ఒక ఎమోషన్

సాగర్ ఆనకట్ట కేవలం రాళ్లు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు. ఇది లక్షలాది మంది శ్రమజీవుల కష్టం. కరవు కోరల్లో చిక్కుకున్న తెలుగు నేలకు ఊపిరి పోసిన ఈ ప్రాజెక్టును భారత తొలి ప్రధాని నెహ్రూ ‘ఆధునిక దేవాలయం’గా అభివర్ణించారు. ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా కార్మికులు, ఇంజినీర్లు శ్రమించి ఈ మహానిర్మాణం పూర్తి చేశారు. ఎన్ని పండగలున్నా సాగర్ నిండితేనే ఉమ్మడి NLG రైతులకు పద్ద పండుగ.
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.


