News February 28, 2025
ద్వారకాతిరుమల: నిమ్మకాయలు అమ్మిన సినీ నటుడు షఫీ

ప్రముఖ క్షేత్రం ద్వారకాతిరుమలలో సినీ నటుడు షఫీ నిమ్మకాయలు అమ్మి సందడి చేశారు. నిన్న ఆయన మరో నటుడు మాణిక్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో లింగయ్య చెరువు వద్ద నిమ్మకాయలు అమ్మే మహిళా వ్యాపారులు ఆయన కారును ఆపి, వాటిని కొనాలని కోరారు. వెంటనే కారు దిగిన షఫీ తాను నిమ్మకాయలు అమ్ముతాను అంటూ, వారితో కలిసి సందడి చేశారు.
Similar News
News December 13, 2025
BREAKING: నెల్లూరు మేయర్ రాజీనామా

అనుహ్య పరిణామాల మధ్య నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటన చేశారు. కలెక్టర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనను మేయర్ని చేసిన వైసీపీ అధినేత జగన్కు రుణపడి ఉంటానన్నారు.
News December 13, 2025
HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లు నిర్ణయించారు.
News December 13, 2025
జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.


