News March 3, 2025
ద్వారకాతిరుమల: రూ. 55.423 వేల కరెంట్ బిల్

ద్వారకాతిరుమలలోని గుడి సెంటర్లో ఓ టీ కొట్టు వ్యాపారి కరెంట్ బిల్ చూసి షాక్‌కు గురయ్యాడు . ప్రతినెలా తన షాపుకు రూ. 400లు లోపు కరెంటు బిల్లు వచ్చేది. అయితే ఈనెల బిల్లు రూ. 55.423లు రావడంతో ఆయన నోరు వెల్లబెట్టాడు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
వచ్చే నెల 19న నంద్యాలకు రానున్న సీఎం

సీఎం చంద్రబాబు వచ్చే నెల 19న నంద్యాలకు రానున్నారు. హరిజనవాడ సమీపంలోని కంపోస్ట్ యార్డులో క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు అక్కడే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నంద్యాలకు తొలిసారి వస్తున్నారని టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
News March 20, 2025
NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
News March 20, 2025
ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉండాలా? వద్దా?

IPL-2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని, ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రూల్ ప్రవేశపెట్టాక 2023లో ఒకసారి, 2024లో 8 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఒకసారి మాత్రమే (2013లో) 250+ నమోదైంది. 2024లో జట్ల రన్‌రేట్ 9.56గా ఉండగా 2022లో 8.54గానే ఉంది. దీనిపై మీ కామెంట్.