News May 4, 2024

ద్వారకాతిరుమల: శ్రీవారి సేవాటికెట్ల రుసుముల పెంపు

image

ద్వారకాతిరుమల శ్రీవారి సేవాటికెట్ల రుసుములను పెంచినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. సుప్రభాత సేవా టికెట్ రుసుము రూ.200 నుంచి రూ.300, అష్టోత్తరం శతనామార్చన రూ.300 నుంచి రూ.500, దీపారాధన సేవ రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Similar News

News November 26, 2025

భీమవరం: ఎస్సీ, ఎస్టీ యువతకు సివిల్స్ ఉచిత శిక్షణ

image

రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబరు 26లోపు https://apstudycircle.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 10 నుంచి 4 నెలలపాటు శిక్షణ ఉంటుందని, మహిళా అభ్యర్థులకు 33 శాతం సీట్లు కేటాయించామని ఆయన వివరించారు.

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.