News May 4, 2024

ద్వారకాతిరుమల: శ్రీవారి సేవాటికెట్ల రుసుముల పెంపు

image

ద్వారకాతిరుమల శ్రీవారి సేవాటికెట్ల రుసుములను పెంచినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. సుప్రభాత సేవా టికెట్ రుసుము రూ.200 నుంచి రూ.300, అష్టోత్తరం శతనామార్చన రూ.300 నుంచి రూ.500, దీపారాధన సేవ రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Similar News

News November 3, 2024

ఏలూరు: యువతి కడుపులో కేజీన్నర వెంట్రుకలు

image

ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యులు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ఒక యువతి కడుపులో నుంచి సుమారు కేజీన్నర వెంట్రుకలు తొలగించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొల్లేరు పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతి గత కొన్ని రోజులుగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆశ్రమం ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు కడుపులో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స చేసి వెంట్రుకలు తొలగించారు.

News November 2, 2024

రూ.800 కోట్లతో రహదారులకు మరమ్మతులు: మంత్రి

image

రాష్ట్రంలో రూ.800 కోట్లతో రహదారులపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేపట్టనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల వద్ద రూ.30 లక్షలతో పాలకొల్లు – దొడ్డిపట్ల రహదారి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఆర్ & బీ డీఈ లు పాల్గొన్నారు.

News November 2, 2024

ప.గో.: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

image

గోదావరి పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధులతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.