News January 29, 2025
ద్వారకాతిరుమల: 5 గంటల వరకే విద్యుత్ సరఫరా

భీమడోలు 220KV విద్యుత్ సబ్ స్టేషన్లో కండక్టర్ మార్పు, మరమ్మతుల కారణంగా ఈనెల 31న వ్యవసాయం, తాగునీరు సర్వీసులకు ఉదయం 5 గంటల వరకు మాత్రమే కరెంట్ సరఫరా ఇస్తామని ఆ శాఖ ఈఈ అంబేద్కర్ తెలిపారు. 220KV భీమడోలు సబ్ స్టేషన్ విద్యుత్ కేంద్రం పరిధిలోని భీమడోలు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల వ్యవసాయ, ఇతర విద్యుత్ వినియోగదారులు గమనించి, తమకు సహకరించాలని కోరారు.
Similar News
News October 26, 2025
ఏలూరు: రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో అక్టోబర్ 27, 28వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News October 26, 2025
HYD: NIMSకి పెరుగుతున్న రోగుల తాకిడి

పంజాగుట్ట NIMS హాస్పటల్లో ఉదయం సమయాల్లో రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా మెడికల్ కౌంటర్, ల్యాబ్, ఫార్మసీ వద్ద వైద్య సేవలకు వస్తున్న రోగులు ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు అవసరమైతే అదనపు సిబ్బంది, కౌంటర్లు ఏర్పాటు చేసి, వేగవంతమైన సేవలు అందించడం ద్వారా రోగుల భద్రత, సౌకర్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.


