News January 29, 2025

ద్వారకాతిరుమల: 5 గంటల వరకే విద్యుత్ సరఫరా 

image

భీమడోలు 220KV విద్యుత్ సబ్ స్టేషన్లో కండక్టర్ మార్పు, మరమ్మతుల కారణంగా ఈనెల 31న వ్యవసాయం, తాగునీరు సర్వీసులకు ఉదయం 5 గంటల వరకు మాత్రమే కరెంట్ సరఫరా ఇస్తామని ఆ శాఖ ఈఈ అంబేద్కర్ తెలిపారు.  220KV భీమడోలు సబ్ స్టేషన్ విద్యుత్ కేంద్రం పరిధిలోని భీమడోలు, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల వ్యవసాయ, ఇతర విద్యుత్ వినియోగదారులు గమనించి, తమకు సహకరించాలని కోరారు.

Similar News

News February 16, 2025

చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

image

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 16, 2025

తునిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి 

image

తుని పట్టణంలోని డీ మార్ట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వ్యానును బైకు వెనుకనుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రుడిని తుని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.

News February 16, 2025

బెల్లంపల్లి: చర్లపల్లి అటవీ పరిధిలో పెద్దపులి

image

గత 15 రోజులుగా బెల్లంపల్లి, తాండూర్ మండల ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి తాజాగా మండలంలోని చర్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారి పూర్ణచంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం చర్లపల్లి అటవీ ప్రాంత పరిధిలో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి పశువులను మేపేందుకు వెళ్ళవద్దన్నారు. గుంపులు, గుంపులుగా ఉండాలన్నారు.

error: Content is protected !!