News March 9, 2025
ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. నిందితుడు అరెస్టు

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 24, 2026
వీఆర్‌ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వీఆర్‌ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్‌ఎస్-1లో 1,126 మందికి, వీఆర్‌ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్‌ఎస్‌కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్‌లో మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.


