News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
Similar News
News March 16, 2025
జడ్చర్ల: మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు

మండలంలోని కోల్‌బాయితండాకు చెందిన శారద(45) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. శారద భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో కుమారుడు, కోడలి దగ్గర కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తనను వేధిస్తున్నారని తండ్రి తథ్యుతో వాపోయింది. ఈ నేపథ్యంలోనే శారద ఆత్మహత్య చేసుకోగా.. అందుకు కారకులుగా మృతురాలి కుమారుడు, కోడలే అని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News March 16, 2025
MBNR: బావిలో పడి వ్యక్తి మృతి

మిడ్జిల్ మండలంలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికుల వివరాలు.. వేములకు చెందిన చంద్రయ్య(50) గురువారం రాత్రి గ్రామంలో చేసిన కాముడి దహన కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. గ్రామ సమీపంలోని బావిలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవటంతో మునిగిపోయారు. ఈ క్రమంలో శనివారం శవమై తేలాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
News March 15, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.