News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
Similar News
News March 6, 2026
MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.
News March 6, 2026
MBNR: యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పౌల్ట్రీ ఫారం రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.
News March 6, 2026
MBNR: అధిక ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో.. చిన్న చింతకుంట మండలం నంది వడ్డేమాన్‌లో, కోయిలకొండ మండలం పారుపల్లిలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భూత్పూర్ 38.4, చిన్న చింతకుంట 38.1, అడ్డాకుల 38.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 37.9, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, మూసాపేట మండలం జానంపేట 37.8, దేవరకద్ర 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


