News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
Similar News
News December 17, 2025
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: కామారెడ్డి జిల్లా ఎస్పీ

ఈనెల 17వ తేదీన జరిగే మూడో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ సిబ్బంది పటిష్ఠంగా పోలింగ్ నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 812 మంది పోలీసుల సిబ్బందితో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశామని, అలాగే 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 37 రూట్ మొబైల్ పార్టీలు, 25 ఎఫ్ఎస్టీ బృందాలు, 5 ఎస్ఎస్టీ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామన్నారు.
News December 17, 2025
ASF: మూడో విడత ఎన్నికలకు సన్నద్ధం: కలెక్టర్

మూడో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల్లో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు 17న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో 1.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
News December 16, 2025
Photos: వనతారలో మెస్సీ పూజలు

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.


