News April 17, 2025
ధరణి పోర్టల్‌కు భూభారతికి మధ్య చాలా తేడా: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్‌కు గతంలోని ధరణి పోర్టల్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. బుధవారం భూభారతి పోర్టల్‌పై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌లో మరో 14 అంశాలను ప్రభుత్వం చేర్చిందన్నారు. గతంలో భూ సమస్యలపై కోర్టులను ఆశ్రయించేవారని, నేడు దాని స్థానంలో షెడ్యూల్ ” ఏ” ఉందన్నారు.
Similar News
News April 25, 2025
BREAKING: తప్పిన రైలు ప్రమాదం

తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
News April 25, 2025
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 25, 2025
యలమంచిలి: వ్యక్తిని దారుణంగా చంపిన దంపతులు

యలమంచిలి మండలం కొంతేరులో కత్తుల పౌలు(59) <<16199598>>హత్యకు గురైన సంగతి తెలిసిందే<<>>. ఈ కేసుపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న పౌలు, ఏసుదాసు కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. బుధవారం రాత్రి పౌలు ఇంటికి వెళ్లిన ఏసుదాసు మంచంపై నిద్రిస్తున్న పౌలుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇందుకు ఏసుదాసు భార్య భారతి కూడా సహకరించింది. నిందితులు ఏసుదాసు, భారతీలను అదుపులోకి విచారిస్తున్నారు.