News June 28, 2024
ధరణి సమస్యలు పరిష్కరించండి: రాహుల్‌రాజ్
జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం చిలిపిచేడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News December 21, 2024
సీఎం రేవంత్ పర్యటన, ఏడుపాయలలోనే అభివృద్ధి పనులకు శంకస్థాపన
ఈనెల 25న మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఏడుపాయలలో వన దుర్గా మాతను దర్శించుకుంటారు. అనంతరం మెడికల్ కళాశాల భవనం, ఏడుపాయల, చర్చి అభివృద్ధికి నిధులు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి మెదక్ చర్చి సందర్శించి వందేళ్ల పండుగ, ప్రార్థనల్లో పాల్గొంటారని సమాచారం.
News December 20, 2024
మెదక్: ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎట్ హోం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News December 20, 2024
రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు
రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి ఖాసిం బేగ్ మీద తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ లోని హాకీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి సీఎం కప్ హాకీ క్రీడా పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.