News July 26, 2024
ధరల పట్టిక తప్పనిసరిగా ఉండాలి: ఈవో
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. త్వరలో ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది, హోటల్ యజమానులకు శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ప్రతి హోటల్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News January 13, 2025
‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.
News January 13, 2025
చిత్తూరు: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
రేపు PGRS రద్దు: చిత్తూరు ఎస్పీ
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ DPRO కార్యాలయంలో రేపు నిర్వహించాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం భోగి పండుగ సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.