News October 31, 2024

ధరూరు: పాఠశాలలో పాము కలకలం..

image

ధరూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాము కలకలం రేపింది. విద్యార్ధులు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్ల కింద ఆడుకునేందుకు వెళ్లిన సమయంలో పాము కనిపించడంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు అప్రమత్తం అయి విద్యార్థులను రక్షించారు. పాము బీసీ హాస్టల్‌లో చొరబడటం చూసి పలువురు గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపారు. చుట్టు పక్కల చెత్త పేరుకుపోవడంతో పాములు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు.

Similar News

News November 28, 2025

MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 27, 2025

MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

News November 27, 2025

బాలానగర్‌లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్‌లో 13.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.