News June 12, 2024
ధరూరు: సైబర్ నేరగాళ్ల మోసం.. నగదు మాయం

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ఏఎస్ఐ మాట్లాడుతున్నానని తనకు డబ్బు కావాలని ఈనెల 4న పెట్రోల్ బంకు యజమానికి ఫోన్ చేశాడు. తాను అందుబాటులో లేనని మేనేజర్ గోపి నెంబర్ ఇచ్చాడు. గోపి ఆ వ్యక్తికి రూ.80 వేలు బదిలీ చేశాడు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 26, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎస్పీ కీలక సూచనలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ డి.జానకి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
✒అదనపు బందోబస్తు
✒24 గంటల విజిలెన్స్
✒డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై ప్రత్యేక నిఘా
✒అక్రమ రవాణా, గోప్యమైన కదలికలను అరికట్టేందుకు FFT, SST ప్రత్యేక టీమ్‌లు
News November 26, 2025
మహబూబ్‌నగర్‌లో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు

మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు, 3,674 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించవద్దని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
#SHARE IT.
News November 26, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.


