News February 12, 2025

ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్‌ఐ.!

image

ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్‌పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను, డ్రైవర్‌ను హాజరుపరిచారు.

Similar News

News February 23, 2026

మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.