News April 7, 2025
ధరూర్: రెండు బైక్లు ఢీ ఓ వ్యక్తి మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం ధరూర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ ఎబ్బనూరు నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో నర్సింహులు వికారాబాద్ నుంచి చింతకింది వెళ్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి. నర్సింహులుకు తీవ్ర గాయాలు కాగ శ్రీనివాస్ మృతి చెందారు.
Similar News
News December 16, 2025
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News December 16, 2025
VZM: కానిస్టేబుల్ అభ్యర్థులు.. ఎన్నాళ్లో వేచిన ఉదయం.!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి విజయనగరం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.
News December 16, 2025
ADB: ఇక్కడ 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు

GP ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. గ్రామంలోని 2257 ఓటర్లు ఈ నెల 17న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


