News April 12, 2025

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తెలిపారు. కావున ఏవైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయాలంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 2, 2025

కరువు మండలాల జాబితా విడుదల

image

AP: 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.

News November 2, 2025

నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

image

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం

News November 2, 2025

రామప్ప ట్రస్ట్ బోర్డు నియామకం కోసం ఎదురుచూపు?

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ గత నెలలో దరఖాస్తులను స్వీకరించింది. అక్టోబర్ చివరి వారంలో బోర్డు నియామకం ఉంటుందని భావించినప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా నామినేట్ పదవుల పంపిణీ జరుగుతుండటంతో నవంబర్ నెలలో ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలోనైనా ఏర్పాటయ్యేనా? చూడాలి.