News February 1, 2025
ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2025
NZB: రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో జిల్లా వాసులు

తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో నిజామాబాద్ జిల్లా బాధ్యులకు చోటు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మేకల అభినవ్ సంయుక్త కార్యదర్శిగా, అనిత ఈసీ మెంబర్‌గా, నవీన్ నిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం బాధ్యులు నూతన కార్యవర్గాన్ని వెల్లడిస్తూ ఎన్నికైన వారిని అభినందించారు.
News February 18, 2025
NZB: ఎస్ఐని ఢీకొని పరారైన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐను ఓ వ్యక్తి కారుతో ఢీకొని పరారైన ఘటన NZBలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి RR చౌరస్తాలో 4వ టౌన్ ఎస్ఐ-2 ఉదయ్ వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆయణ్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. సిబ్బంది ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
News February 18, 2025
ముప్కాల్: కాల్వలో పడి రైతు దుర్మరణం

ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన కోమటి శెట్టి చిన్నయ్య (46) అనే రైతు ప్రమాదవశాత్తు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాల్వ లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రజినీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాల్వ మోటార్ ద్వారా తన చేనుకు నీరు అందించుకుంటున్నాడు. మోటర్‌లో నీరు తక్కువగా రావడంతో కాల్వలోకి దిగి నాచు తొలగించుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో కొట్టుకపోయాడు.