News March 24, 2025
ధర్పల్లి: ‘పది’ పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
Similar News
News October 28, 2025
NZB: నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి కింద పడి ఉండగా స్థానికులు, పోలీసుల సహకారంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సదురు వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడు వయసు 50 నుంచి 55 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.
News October 28, 2025
‘తుఫాన్ ఎఫెక్ట్.. ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’

రానున్న 3 రోజులు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సోమవారం సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టారని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
News October 27, 2025
నిజామాబాద్: రేపు 12 సోయబిన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇప్పటికే జిల్లాలో వరి, మొక్క జొన్న ధాన్ సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం కూడా జిల్లాలో మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


