News March 17, 2025

ధర్పల్లి: మల్లయ్యను చంపిన భార్య, కొడుకు

image

ధర్పల్లి (M) హోన్నాజిపేట్లో <<15782697>>మల్లయ్య <<>>హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన మల్లయ్యకు కొన్నెళ్లుగా భార్యతో, కొడుకుతో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం తండ్రీకొడుకులు గొడవపడగా విషయాన్ని తల్లికి చెప్పాడు. దీంతో తల్లీకొడుకులు మల్లయ్యతో గొడవపడి కొందకు పడేసి, బీరుసీసాతో తలపై కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 1, 2025

NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

image

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.

News December 1, 2025

NZB: రెండో దశ తొలి రోజు 270 నామినేషన్లు

image

NZB జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో NZB డివిజన్‌లోని ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.