News January 29, 2025

ధర్పల్లి: మిషన్ భగీరథ ఏఈఈ ఆత్మహత్య

image

ధర్పల్లిలో మిషన్ భగీరథ AEEగా విధులు నిర్వహిస్తున్న సాయి చరణ్(25) డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. NZB సుభాష్ నగర్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

నిజామాబాద్: 1,543 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 2వ రోజైన గురువారం 1,543 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 294 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 1,249 మంది నామినేషన్లు వేశారు.

News December 5, 2025

NZB: ఈ నెల 14 నుంచి ఓపెన్ యునివర్సిటీ పీజీ తరగతులు ప్రారంభం

image

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల14వ తేది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డా.రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 738 2929612, www.braouonline.inను సందర్శించాలన్నారు.