News February 23, 2025
ధర్మపురిలో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్, గోధూరు, ధర్మపురి, గొల్లపల్లిలో 38.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్ 38, సిరికొండ, కొల్వాయి 37.8 మేడిపల్లి, మారేడుపల్లి 37.7 అల్లిపూర్, నేరేళ్ల, జైన 37.6 పెగడపల్లి 37.3 మల్యాల, రాయికల్ 37.2 రాఘవపేట 36.9 మెట్‌పల్లి 36.8 గుల్లకోట, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్ 36.7 మన్నెగూడెం 36.6 కోరుట్ల, జగిత్యాలలో 36.4℃గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News March 17, 2025
ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం.

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
News March 17, 2025
విశాఖ నుంచి HYD ట్రావెల్స్ బస్సులో మంటలు

విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం స్వల్పమే అయినప్పటికీ బస్సు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయంగా రావాల్సిన బస్సు రెండు గంటలు కావస్తున్నా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా నక్కపల్లి హైవేపై చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా వెనక చక్రాల డమ్ములు గట్టిగా పట్టేయడంతో స్వల్ప మంటలు చేలరేగాయి. ఈ ఘటన 9 గంటలకు జరిగింది.