News September 27, 2024

ధర్మపురిలో వెరైటీ లక్కీ డ్రా

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఆన్‌లైన్ సెంటర్ యజమాని దసరా పండుగను పురస్కరించుకుని వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. రూ.50 చెల్లించి టోకెన్ తీసుకోవాలని, లక్కీ డ్రా అక్టోబర్ 12న ఉ.9 గంటలకు తీయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి మేకపోతు, రెండవ బహుమతి కింగ్‌ఫిషర్ బీర్ కాటన్, మూడో బహుమతి కోడిపుంజు అని ఐదు బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Similar News

News November 2, 2025

కరీంనగర్ : ఈనెల 15న లోక్ అదాలత్

image

కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల పరిధిలో ఈనెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ తెలిపారు. లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 2, 2025

తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

image

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

News November 2, 2025

KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.