News June 13, 2024

ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.86,680 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,082, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,350, అన్నదానం రూ.13,248 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News January 15, 2025

KNR: కనుమ పండుగనే పశువుల పండుగ!

image

కనుమను రైతులు పశువుల పండుగగా వ్యవహరిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన పశుపక్షాదులనూ ఈరోజు పూజిస్తారు. ఎద్దులను, ఆవులను, గేదెలను వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి, ఈత  కొట్టిస్తారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది పూజిస్తారు.

News January 15, 2025

అంబరాన్నంటిన కొత్తకొండ జాతర

image

ఉమ్మడి కరీంనగర్ జల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల మండల ప్రజలు ఎడ్లబండ్ల రథాలతో కొత్తకొండకు వచ్చారు. వీరభద్రస్వామికి కోరమీసాలు, కోడెమొక్కులు, గుమ్మడికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శరభ శరభ స్లోగన్స్‌తో మారుమోగింది.

News January 15, 2025

విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం

image

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.