News December 31, 2024

ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు రూ.62,01,156 

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.62,01,156 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.62,720, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,380, అన్నదానం రూ.7,458, హుండీ లెక్కింపు ద్వారా రూ.60,87,598 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News January 6, 2025

ఆధునిక టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్: శ్రీధర్ బాబు

image

ఆధునిక టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ విస్తరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు ‘డేటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్‌ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించి మాట్లాడారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News January 6, 2025

కరీంనగర్: మానసాదేవి టెంపుల్.. చాలా స్పెషల్!

image

KNR జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలోని 800ఏళ్లనాటి మానసాదేవి మహాక్షేత్రం ప్రత్యేకమైనది. దేశంలో వెలసిన 2 స్వయంభు ఆలయాల్లో మొదటిది హరిద్వార్‌లో ఉండగా.. రెండోది మన జిల్లాలోనే ఉండటం విశేషం. అమ్మవారు కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారితో పాటు దాదాపు 108 నాగదేవతల విగ్రహాలు ఉన్నాయట. గత ఆరేళ్లలో సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

News January 6, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. @ గంభీరావుపేట మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరికి గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ గంగాధర మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం.