News September 3, 2024
ధర్మపురి క్షేత్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న గోదావరి వరద

జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పెరుగుతోంది. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో పుష్కర స్నాన ఘట్టాలు నీట మునిగాయి. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద పరిస్థితిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News October 13, 2025
KNR: యూనిసెఫ్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

యూనిసెఫ్ సహకారంతో జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15న గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహణ, స్వచ్ఛ హరిత విద్యాలయాల నమోదు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News October 13, 2025
కరీంనగర్: ప్రజావాణికి 271 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 271 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అ.కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, RDOలు పాల్గొన్నారు.
News October 13, 2025
JMKT: భారీగా తరలివచ్చిన పత్తి.. తగ్గిన ధర..!

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 174 వాహనాల్లో 1408 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 43 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,200 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.400 తగ్గింది.