News March 22, 2024
ధర్మపురి క్షేత్రానికి భక్తుల తాకిడి
పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడవ రోజైన నేడు వైభవంగా కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
Similar News
News September 17, 2024
ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొన్నం
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2024
KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి
గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న నిమజ్జనం
మానకొండూరు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి పెద్ద చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయగా, మానకొండూరులో తెల్లవారుజాము వరకు నిమజ్జనం ఉత్సవాలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఉత్సవాలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాకుండా తిమ్మాపూర్ మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ప్రతిష్టించిన విగ్రహాలు మానకొండూర్ చెరువులోనే నిమజ్జనం చేశారు.