News April 8, 2025

ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ గత కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తన తండ్రి మహమ్మద్ అలీ అహ్మద్ ఆచూకీ తెలిపామని ఆయన వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 19, 2025

ఏలూరు: మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో.జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో మొత్తం 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310 పోస్టులు భర్తీ చేస్తారు. ఇటీవల జిల్లాకు మంజూరైన 166 స్పెషల్ పోస్టుల భర్తీని డీఎస్సీతో సంబంధం లేకుండా విడుదల చేస్తారు.

News April 19, 2025

ఆ లిస్టులో సెకండ్ ప్లేస్‌కు పాటీదార్

image

నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్‌(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్‌లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

News April 19, 2025

సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

image

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్‌కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!