News February 17, 2025
ధర్మపురి: ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 ఆదాయం

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,29,874 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.57,208, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,910 అన్నదానం రూ.9,756 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 27, 2025
ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.
News November 27, 2025
TTD మాజీ AVSO కుటుంబానికి స్నేహితుల అండ

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన TTD మాజీ AVSO వై.సతీశ్ కుమార్ కుటుంబానికి ఆయన స్నేహితులు(2012 బ్యాచ్మేట్స్) అండగా నిలిచారు. ఈనెల 15న పరకామణి కేసు విచారణకు వెళ్తూ సతీష్ రైలు పట్టాలపై శవంగా కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కర్మక్రియలకు హాజరైన AP, తెలంగాణలకు చెందిన బ్యాచ్మేట్స్ సతీష్ తల్లి పేరిట రూ.3 లక్షలు, పిల్లల పేరిట రూ.11 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.


