News February 1, 2025

ధర్మపురి: ఫుడ్ పాయిజన్ ఘటన.. మాజీ మంత్రి ఫైర్ 

image

ధర్మపురి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్లు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు అయిన పిల్లలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.

Similar News

News July 8, 2025

లైంగిక ఆరోపణలు.. దయాల్‌పై FIR నమోదు

image

పేసర్ యష్ దయాల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాపురం PSలో FIR నమోదైంది. అతనిపై ఘజియాబాద్ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె CM గ్రీవెన్స్ పోర్టల్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.

News July 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 8, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.