News February 8, 2025
ధర్మపురి: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
మహబూబాబాద్ బస్టాండ్లో భారీ చోరి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో భారీ చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ.7 లక్షల విలువైన 41/2 తులాల బంగారు, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగును దుండగులు అపహరించారని బాధితులు వాపోయారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు దోచుకుపోయారు.
News February 25, 2026
తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.
News February 25, 2026
ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.


