News March 4, 2025

ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 24, 2025

ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

image

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.

News November 24, 2025

కల్వకుర్తి: భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

image

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లిలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

News November 24, 2025

అనకాపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

image

లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ దాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.